Vijay-Rashmika Wedding: విజయ్ రష్మికల కళ్యాణ ముహూర్తం ఇదే.. ముచ్చటగా రెండు పద్ధతుల్లో పెళ్లి!

Vijay-Rashmika Wedding: విజయ్ రష్మికల కళ్యాణ ముహూర్తం ఇదే.. ముచ్చటగా రెండు పద్ధతుల్లో పెళ్లి!

టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో ఏడడుగులు వేయబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. విజయ్, రష్మిక బంధువులు, సన్నిహితులు , సెలబ్రిటీలతో  ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ లో  సందడి వాతావరణం నెలకొంది.

ముహూర్తం సమయం.

విజయ్ రష్మికల పెళ్లి సుముహూర్తం గురువారం ఉదయం 8 గంటలకు ఖరారు చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం . ఈ వివాహం కేవలం ఒక సంప్రదాయానికి పరిమితం కాకుండా, విజయ్ తెలుగు మూలాలను గౌరవిస్తూ తెలుగు పద్ధతిలో, రష్మిక కుటుంబ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ కొడవ (కూర్గ్) సంప్రదాయం ప్రకారం రెండు రకాలుగా జరగనుంది. ఉదయం తెలుగువారి సంప్రదాయంగా, సాయంత్రం రష్మిక కొడవ సంప్రదాయం ప్రకారం వివాహం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : రష్మిక మిమ్మల్ని పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి షాకింగ్ రియాక్షన్ వైరల్!

ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో 'విరోష్' మ్యాజిక్

మంగళవారం నుంచే ఉదయ్‌పూర్‌లోని ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ సందడిగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్‌డేట్స్ ప్రకారం, ఈ వివాహ వేడుకల్లో వినూత్నమైన అంశాలు చోటుచేసుకున్నాయి . అతిథుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్‌లువిరోష్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు.  పాప్‌కార్న్ బకెట్లపై 'Virosh' అని ముద్రించిన కస్టమ్ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. 

 

బుధవారం జరిగిన సంగీత్ వేడుకలో విజయ్-రష్మికల సినీ ప్రయాణం, వారి వ్యక్తిగత ఫోటోలతో వేదికను అద్భుతంగా అలంకరించారు.  బుధవారం ఉదయం హల్దీ వేడుకలో పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన ఈ జంట, సాయంత్రం మెహందీ వేడుకలో సన్నిహితులతో కలిసి చిందేశారు.

 

 అతిథుల జాబితా

హైదరాబాద్ నుండి ఇప్పటికే ఒక ప్రత్యేక విమానంలో విజయ్ కుటుంబం, సోదరుడు ఆనంద్ దేవరకొండ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. దర్శకులు తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. నటీమణులు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్,  ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు ఈ వేడుకలో మెరిశారు.

ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం

విజయ్ రష్మికలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందన లేఖ పంపారు.   "వెండితెరపై విజయ్, రష్మికలు ఎన్నో స్క్రిప్ట్‌లు చూసి ఉండవచ్చు. కానీ దేవుడు స్వయంగా రాసిన ఈ నిజ జీవిత 'కొత్త అధ్యాయం' వారి సినిమాల కంటే అద్భుతంగా, ప్రేమతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. లేఖలో పేర్కొన్నారు. వివాహం జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ జంటను ఆశీర్వదించారు.  మరికొద్ది గంటల్లో విజయ్-రష్మిక దంపతులు కాబోతున్నారన్న వార్త ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.