ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించారన్న కేసులో అజ్ఞాతంలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. 

శంషాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించారంటూ జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.  ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణా రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు నుంచి ఎలాంటి మధ్యంతర రక్షణ లభించలేదు.

►ALSO READ | హైదరాబాద్ లో 53 శాతం పూర్తి.. ఆగస్టు 10న ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ .. సర్ పై ఆర్వీకర్ణన్  కీలక ప్రకటన

అతిగా మద్యం తాగి  అప్పట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ మిర్యాలగూడ దగ్గర ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.