విజయనగరం జిల్లా మేరకముడిదాం మండల పరిధిలోని కోర్లం, బిళ్ళవలస, సమీప గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో పంట పొలాలపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. వరి, అరటి తోటలతో పాటు సాగునీటి పైపులను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఏ క్షణంలో ఏనుగులు గ్రామాలపైకి దాడి చేస్తాయోనని స్థానికులు రాత్రంతా జాగారం చేస్తూ భయం భయంగా గడుపుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని ఏనుగుల కదలికలపై నిఘా పెట్టారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని, ఏనుగులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. నష్టపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించి, ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులు కోరుతున్నార
