తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ( సెప్టెంబర్ 19 ) శ్రీవారు గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలి రావడంతో తిరుమల ఘాట్ రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలో కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించట్లేదు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. కొండపై పార్కింగ్ సర్దుబాటు చేసిన తర్వాతే ప్రైవేట్ వాహనాలను అనుమతిస్తామని తెలిపారు టీటీడీ అధికారులు.
ALSO READ : వీకెండ్ అని ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్న భక్తులకు అలర్ట్
ఇదిలా ఉండగా ఇవాళ వైభవంగా జరగనున్న గరుడ వాహన సేవకు భారీ ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు, పోలీసులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) రాత్రి నుంచే ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. సెప్టెంబర్ 20 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు అధికారులు.
