Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో రెండో వారమే కీలకంగా మారింది. మొదటి వారం ఉత్కంఠ తర్వాత ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్ పడుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. 11 మంది నామినేషన్స్‌లో ఉండగా.. ఓటింగ్‌లో వరుసగా వెనుకబడిన ఓ సీనియర్ నటుడి పేరు ఇప్పుడు ఎలిమినేషన్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. తాజా అనధికారిక సమాచారం ప్రకారం.. వీకెండ్ ఎపిసోడ్‌లో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందట. ఇంతకీ ఆ నటుడు ఎవరు? రెండో వారంలోనే ఎందుకు ప్రేక్షకుల ఓట్లను కోల్పోయారు? అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం..
కృష్ణుడికే ఎలిమినేషన్ షాక్?
రెండో వారంలో రోహిత్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్, వర్షిణి, కృష్ణుడు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నటుడు కృష్ణుడు ఓటింగ్ ట్రెండ్స్‌లో చివరి స్థానంలో కొనసాగుతున్నట్లు అనధికారిక పోల్స్, సోషల్ మీడియా ట్రాకర్స్ పేర్కొంటున్నాయి.
వారంలో ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా మార్పు లేకుండా కృష్ణుడు డేంజర్ జోన్‌లోనే ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో ఆయన ఎలిమినేట్ అవ్వొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే అధికారికంగా ఎలిమినేషన్‌ను ప్రకటించే వరకు దీనిని ఖరారు చేసిన ఫలితంగా చూడాల్సి ఉంటుంది.
రెండో వారంలోనే హౌస్ నుంచి ఔట్?
‘వినాయకుడు’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇండస్ట్రీలో తనకు మరో మంచి అవకాశం రావాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే హౌస్‌లోకి వచ్చిన రెండు వారాల్లోనే ఆయన ప్రయాణం ముగిసే పరిస్థితి కనిపిస్తోంది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో కూడా కృష్ణుడు పెద్దగా హైలైట్ కాలేకపోయారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
కృష్ణుడు ఎందుకు డేంజర్‌లోకి వచ్చాడు?
బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే గేమ్‌తో పాటు తన ఉనికిని కూడా బలంగా చాటుకోవాలి. కానీ రెండో వారంలో కృష్ణుడు మాత్రం ఎక్కువగా సైలెంట్‌గానే కనిపించారు. కీలక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ.. గేమ్‌లో ఆయనకు సంబంధించిన హైలైట్ మూమెంట్స్ పెద్దగా కనిపించలేదు. టాస్కుల్లోనూ పూర్తిస్థాయిలో మెప్పించే అవకాశం రాకపోవడం, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడా ఎక్కువ ఇంపాక్ట్ కనిపించకపోవడంతో ఓటింగ్‌లో వెనుకబడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండో వారంలోనే కృష్ణుడి బిగ్ బాస్ జర్నీ ముగిసే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ : తల్లి–కొడుకు కథగా ‘ది ప్యారడైజ్’..
ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కృష్ణుడి పేరు ఎలిమినేషన్ రేసులో గట్టిగా వినిపిస్తున్నప్పటికీ.. బిగ్ బాస్ హౌస్‌లో చివరి నిమిషంలో ఏమైనా ఊహించని పరిణామం చోటుచేసుకుంటుందా? ఓటింగ్ ట్రెండ్స్ నిజమైన ఫలితాన్ని ప్రతిబింబిస్తున్నాయా? లేక వీకెండ్ ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్‌కు షాక్ తప్పదా? ఈ వారం బిగ్ బాస్ హౌస్‌కు ఎవరు గుడ్‌బై చెబుతారనేది మాత్రం అధికారిక ఎలిమినేషన్‌లోనే తేలనుంది.
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
రెండో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లొచ్చనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. కృష్ణుడితో పాటు వర్షిణి లేదా సృష్టిలో ఒకరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే లేటెస్ట్ ఆన్ అఫీషియల్ సమాచారం ప్రకారం, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చని, ఒక్క కంటెస్టెంట్‌ను మాత్రమే బయటకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదే నిజమైతే కృష్ణుడి ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం ముగియనుంది. మొత్తానికి ఓటింగ్ ట్రెండ్స్‌లో చివరి స్థానంలో ఉన్న కృష్ణుడికే ఎలిమినేషన్ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటి? ఎవరు హౌస్‌ను వీడబోతున్నారు? అనేది వీకెండ్ ఎపిసోడ్‌లోనే తేలనుంది.
