హైదరాబాద్:నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోద ఆస్పత్రి డాక్టర్లు. ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గానే ఉందన్నారు. మాటలకు, నొప్పికి స్పందించడం లేదు.. మరో 72 గంటలు గడిస్తేగానీ చెప్పలేమన్నారు.
గత రెండు రోజుల క్రితం గుండెపోటురావడంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఇంటెన్సివ్ కేర్ లో ఆయనకుచికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మంగళవారం (జూలై28) ఆయన ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోద డాక్టర్లు. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన హెల్త్ కండిషన్ విషమంగానే ఉందన్నారు. ఈఈజీ, ఎంఆర్ ఐ బ్రెయిన్, టీసీడీఎస్ టెస్టుల్లోమెదడు డ్యామేజ్ అయి ఆక్సిజన్ అందని క్లిష్ట పరిస్థితి నెలకొందని డాక్టర్లు చెప్పారు.
►ALSO READ | రేపిస్టులను సమర్థించే వ్యక్తిని.. విద్యాశాఖ మంత్రిని చేయడమేంటీ: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి బాడీ నొప్పికి స్పందించడం లేదు..పరిస్థితి విషమంగానే ఉంది..72 గంటల తర్వాత న్యూరాలజికల్ రీ-అసెస్‌మెంట్ నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందిస్తామని యశోద ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
ఉద్యమనేత ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు, బీఆర్ ఎస్ నేతలు, ఉద్యమ సహచరులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సుదర్శన్ రెడ్డి ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
