మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్నితప్పుబట్టారు. రేపిస్టులను సమర్ధించే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేయడమేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో అంతమంది ఉండగా.. ప్రహాద్ జోషినే ఎందుకు నియమించారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత విద్యా వ్యవస్థలో మార్పులు కోరుతూ ఆందోళనలు చేస్తున్న సమయంలో అత్యాచార నిందితులను సమర్థించే వ్యక్తిని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అత్యాచార నిందితులను కాపాడాలని చెప్పే వ్యక్తికంటే చెడ్డవాడు మరొకరు ఉండరు.. అలాంటి వ్యక్తే ఇవాళ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో ఎంతో మంది ఉండగా, వారిలో ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు.. అలాకాకుండా అత్యాచార నిందితులను సమర్థించే వ్యక్తినే విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమని ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు రాహుల్ గాంధీ.
