రష్యా అధ్యక్షునికి తిరుక్కురల్ బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ.. కారణం ఇదేనా!

రష్యా అధ్యక్షునికి తిరుక్కురల్ బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ.. కారణం ఇదేనా!

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ తిరుక్కురల్ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ. 2026 సెప్టెంబర్ 11న రష్యాలో అనువదించిన తమిళ్ క్లాసిక్ తిరుక్కురల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రామాయణం వంటి గ్రంథాలను కాదని తిరుక్కురల్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుక్కురల్ గ్రంథంతో రష్యాకు శతాబాద్దాల అనుబంధం కారణంగానే ప్రధాని ఆ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్నారు. తిరుక్కురల్ ఫిలాసఫీ రష్యాలో మంచి ఆదరణ పొందిందని, రచయితలు, ఫిలాసఫర్ల ద్వారా రష్యాలో ఎంతో ప్రచారం పొందింది ఈ గ్రంథం. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసిక్ తిమిల్ 2026లో పబ్లిష్ చేసిన ఈ గ్రంథాన్ని రష్యన్ భాషలోకి నైరా ఎంకార్ట్చియన్ ట్రాన్స్ లేట్ చేశారు. 

తిరుక్కురళ్‌కు రష్యాతో ఉన్న సంబంధం: 

భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం పట్ల రష్యన్స్ కు 17వ శతాబ్దం నాటి నుంచే ఎంతో ఆసక్తి ఉన్నట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ తర్వాత తిరుక్కురళ్‌ను ఐరోపా భాషల్లోకి అనువదించడం ద్వారా, అది రష్యన్ డితులు, సాహిత్యవేత్తల దృష్టిని ఆకర్షించింది.

రష్యా ప్రసిద్ధ రచయితలలో ఒకరైన లియో టాల్‌స్టాయ్, 19వ శతాబ్దంలో  తిరుక్కురళ్‌ను చదివారని నమ్ముతారు. సద్గుణం, కరుణ, అహింసలకు అది ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన తాత్విక రచనలను ప్రభావితం చేసిందని చెబుతారు.

20వ శతాబ్దం ప్రారంభంలో మహాత్మా గాంధీతో టాల్‌స్టాయ్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకూ, ఆ గ్రంథంతో ఆయనకున్న అనుబంధానికీ సంబంధం ఉందని తెలుస్తోంది.  టాల్‌స్టాయ్ గాంధీకి తిరుక్కురళ్‌ను సిఫార్సు చేశారని, దానిలోని బోధనలు అహింసపై గాంధీ ఆలోచనలను తీర్చిదిద్దాయనేది కొందరి అభిప్రాయం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదు.  

తిరుక్కురళ్ గురించి..

తమిళ కవి-తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్‌ ఏ ఒక్క మతానికి సంబంధం లేకుండా.. భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులరిజం ఆధారంగా అందులో బోధనలున్నాయి. ఈ గ్రంథం ద్విపద సాహిత్యంలో ఉంటుంది. 133 అధ్యాయాలలో 1,330 ద్విపదలు ఉంటాయి. కబీర్ దోహలకు ఎంత ప్రచారం ఉందో అంతే స్థాయిలో ఈ గ్రంథానికి ప్రాచుర్యం ఉంది.  ఇందులో ఫిలాసఫీ మూడు  ఇతివృత్తాల ఆధారంగా ఉంటుంది. 

అరం (ధర్మం): మొదటి 38 అధ్యాయాలు సద్గుణం, కర్తవ్యం, గృహ జీవితం, ధర్మబద్ధమైన ప్రవర్తన గురించి వివరిస్తాయి.

పొరుళ్ (అర్థం): 39 నుండి 108 అధ్యాయాలు సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజనీతి, రాజకీయాలు, పరిపాలనపై దృష్టి సారిస్తాయి.

ఇన్‌బం (కామం): చివరి 25 అధ్యాయాలు ప్రేమ, ఆప్యాయత, సంబంధాలను అన్వేషిస్తాయి.

ఆసక్తికరంగా, ఈ మూడు మూలస్తంభాలు స్థూలంగా హిందూ ధర్మ, అర్థ, కామ భావనలను ప్రతిబింబిస్తాయి. అయితే మోక్షం లేదా ఆధ్యాత్మిక విముక్తి గురించి ఈ గ్రంథం చెప్పదు. క్రీ.పూ. 300, క్రీ.శ. 500 మధ్య కాలంలో రచించిన తిరుక్కురళ్, శాస్త్రీయ తమిళ సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన రచనలలో ఒకటి.