టాలీవుడ్ స్టార్లకు ఈసీ షాక్.. వెంకటేష్, మహేష్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, సమంతలకు నోటీసులు!

టాలీవుడ్ స్టార్లకు ఈసీ షాక్.. వెంకటేష్, మహేష్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, సమంతలకు నోటీసులు!

టాలీవుడ్ స్టార్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ లోని పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రోజువారీ షూటింగ్‌లు, సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండే టాలీవుడ్ అగ్ర తారలకు ఈ సీ నోటిసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, విక్టరీ వెంకటేష్, లేడీ సూపర్‌స్టార్ సమంత, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాటు ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ సతిమణి ఉపాసన కామినేని, క్రీడా రంగానికి చెందిన వి.వి.ఎస్. లక్ష్మణ్, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ వంటి దిగ్గజాలకు కూడా ఈ నోటీసులు అందాయి. జాతీయ స్థాయిలో ఇన్ఫోసిస్ నందన్ నీలేకణి కుటుంబానికి సైతం ఇటువంటి నోటీసులే వచ్చాయి.  

అయితే నోటీసులు ఎందుకు? అన్న చర్చనడుస్తోంది. దీనికి కారణం ఓటర్ల వివరాల్లో పేరు లేదా తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఉండటం, గత SIR జాబితాతో వివరాలు మ్యాచ్ కాకపోవడం, పాత రికార్డులతో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలతో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఇలాంటి  కారణంతో భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది

 నోటీసు ఇచ్చారంటే ఓటు హక్కు రద్దయినట్లు కాదని, కేవలం వివరాలు సరిచూసుకోవడానికి ఇచ్చిన అవకాశమని అధికారులు వెల్లడించారు. ఈ విచారణకు సెలబ్రిటీలు స్వయంగా హాజరు కాలేకపోతే, తమ ప్రతినిధులను (Authorised persons) పంపించి డాక్యుమెంట్లు సమర్పించే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఏదేమైనా, సాధారణ ప్రజలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..