టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే RWDY ఫ్యాషన్ బ్రాండ్‌తో బిజినెస్ రంగంలో ఉన్న విజయ్.. తాజాగా స్కిన్‌కేర్ బ్రాండ్ ‘Unhype’ను కో-ఫౌండర్‌గా ప్రారంభించారు. ఇవాళ సెప్టెంబర్ 11, 2026న తన సోషల్ మీడియా ద్వారా ఈ బ్రాండ్‌ను అధికారికంగా పరిచయం పరిచయం చేస్తూ, వీడియో రిలీజ్ చేశారు.
విజయ్ తన పోస్ట్‌లో.. తన జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చిన అలవాట్లలో స్కిన్‌కేర్ కూడా ఒకటని, తనకు పనిచేసిన రొటీన్ ఆధారంగా Unhypeను రూపొందించినట్లు చెప్పారు. “ 3 సింపుల్ స్టెప్స్... నా కోసం... మీ కోసం... అబ్బాయిలు, అమ్మాయిలందరి కోసం.. ఎంతో ప్రేమతో మరియు ఉత్సాహంతో.. ఒక మార్పును తీసుకురావాలనే సంకల్పంతో.” అంటూ విజయ్ తన అభిమానులతో కొత్త బ్రాండ్‌ను పంచుకున్నారు.
There are some things that have made a big difference in my life.
— Vijay Deverakonda (@TheDeverakonda) September 11, 2026
There are some habits that have had a huge positive effect on my lifestyle.
Taking good care of my skin is in my top 5.
So, here is-https://t.co/92McdxFYN2
A skincare brand I co-founded, built around what has… pic.twitter.com/y7DPdeBXSP
‘3 సింపుల్ స్టెప్స్’.. తొమ్మిది నెలల కసరత్తు..
“No BS. Only What Works” అనే కాన్సెప్ట్‌తో Unhypeను తీసుకొచ్చారు. భారతీయుల చర్మం, ఇక్కడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులను రూపొందించినట్లు బ్రాండ్ తెలిపింది. ఎండ, చెమట, తేమ, కాలుష్యం వంటి రోజువారీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఫార్ములేషన్స్‌ను అభివృద్ధి చేసినట్లు వీడియో ద్వారా విజయ్ చెప్పుకొచ్చారు. ఈ బ్రాండ్‌లో విజయ్ కేవలం ప్రచారకర్తగా కాకుండా కో-ఫౌండర్, కో-బిల్డర్‌గా ఉత్పత్తుల అభివృద్ధిలో భాగమయ్యారు. దాదాపు తొమ్మిది నెలల పాటు వివిధ ఫార్ములేషన్స్‌ను స్వయంగా ఉపయోగించి పరీక్షించినట్లు తెలిపారు.
ప్రస్తుతం Unhype నుంచి రెండు VD Signature Routines అందుబాటులోకి వచ్చాయి. Acne Safe Routine, Brightening Routine పేరుతో వచ్చే ఈ కిట్లలో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ ఉంటాయి. ఒక్కోదానికి రొటీన్ ధర రూ.1,299గా నిర్ణయించారు. Unhype ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ 21, 2026 నుంచి షిప్‌మెంట్స్ ప్రారంభం కానున్నాయి.
Acne Safe Routine → మొటిమలు/యాక్నే సమస్యలకు అనుకూలమైన స్కిన్‌కేర్ రొటీన్.
→ ముఖ్యంగా ఆయిలీ, మొటిమలు వచ్చే చర్మం కోసం.
Brightening Routine → చర్మానికి కాంతిని అందించే రొటీన్ / చర్మ కాంతి కోసం స్కిన్‌కేర్ రొటీన్
→ డల్‌నెస్, ట్యాన్ తగ్గించి చర్మం కాంతివంతంగా కనిపించేందుకు ఉద్దేశించినదని అర్ధం.
‘రణబలి’తో బిజీ.. బిజినెస్‌లోనూ ఫుల్ జోష్..
విజయ్ దేవరకొండకు ఉన్న ‘రౌడీ’ ఇమేజ్‌ను కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ కొనసాగిస్తూ.. RWDY ఫ్యాషన్ బ్రాండ్ తర్వాత Unhypeతో మరో కొత్త అడుగు వేశారు. ఈ కొత్త బ్రాండ్‌కు యువత నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సినిమాల పరంగానూ విజయ్ బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబలి’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. అక్టోబర్ 16న మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
