CSKలో వాటా కావాలని ధోనీ అడగలే.. కానీ కోట్లు విలువ చేసే షేర్లు ఉన్నాయ్: అసలు ముచ్చట ఇదే!

CSKలో వాటా కావాలని ధోనీ అడగలే.. కానీ కోట్లు విలువ చేసే షేర్లు ఉన్నాయ్: అసలు ముచ్చట ఇదే!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీలో ఎంఎస్ ధోనికి రూపాయి వాటా కూడా లేదంటూ సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయింది. రూ.2,033 కోట్ల విలువైన ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ధోనికి ఏకంగా కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు వచ్చిన తాజా నివేదిక క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

సీఎస్కేలో ధోని వాటా ఎంతంటే: 

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మూలస్తంభంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని సీఎస్కేలో దాదాపు 1 లక్ష షేర్లు కలిగి ఉన్నారు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్లుగా ఉంది. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి నేరుగా కాకుండా, అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన సీఎస్కే షేర్లను ప్రైవేట్ ఆఫ్-మార్కెట్ లావాదేవీల (Off-Market Transactions) ద్వారా మహీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సీఈఓ ఖండించినా బిగ్ ట్విస్ట్: 

ఎంఎస్ ధోని తమను వాటాల కోసం ఎప్పుడూ సంప్రదించలేదని, శ్రీనివాసన్‌తో కూడా దీనిపై చర్చించలేదని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ గతంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎస్కే ప్రమోటర్ అయిన శ్రీనివాసన్ కుటుంబం దగ్గర 55 శాతానికి పైగా మెజారిటీ వాటా ఉండగా.. సాధారణ ప్రజల వద్ద ఉన్న 40 శాతం వాటా (30 కోట్ల షేర్లు) నుంచే ధోని తెలివిగా 1 లక్ష షేర్లను తన సొంతం చేసుకున్నారు.

రూ.1200 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం: 

దాదాపు రూ.1,200 కోట్ల నికర ఆస్తి కలిగిన మహేంద్ర సింగ్ ధోని కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫుట్‌బాల్ టీమ్‌తో పాటు గరుడ ఏరోస్పేస్, కార్స్24, హోమ్‌లేన్, ఈమోటోరాడ్ లాంటి 15కి పైగా దిగ్గజ స్టార్టప్‌లలో ధోని వాటాలని కలిగి ఉన్నాడు. ఇప్పుడు సీఎస్కేలోనూ ఓనర్‌షిప్ వాటా బయటపడటంతో తలా ఈజ్ ది రియల్ బాస్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.