హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో గతంలో అమల్లో ఉన్న రోస్టర్ కం సీనియారిటీ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నం. 202/2010 రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి మోహన్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ లను కలిసి వినతిపత్రాలు సమర్పించింది.
విద్యుత్ సంస్థల్లో మెరిట్ కం సీనియారిటీ విధానాన్ని అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని వారు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల స్ఫూర్తికి అనుగుణంగా గతంలో అమల్లో ఉన్న రోస్టర్ కం సీనియారిటీ విధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా మంత్రులు ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా విని, సమస్య పరిష్కారానికి అనుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బక్క దానయ్య, డీఈ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పి. రామస్వామి, అధ్యక్షులు, ఎన్పీడీసీఎల్, దయానంద్, సీనియర్ నాయకులు, జిల్లా శంకర్, చాట్ల సుధాకర్, వెంకటేశ్వరరావు, కృష్ణ, రవి, ఉప్పలయ్య, భాస్కర్ పలువురు పాల్గొన్నారు.
