కింగ్ జాకీ క్వీన్ మూవీ ట్రైలర్ విడుదల

కింగ్ జాకీ క్వీన్ మూవీ ట్రైలర్ విడుదల

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్ రోల్స్‌‌లో  నటించిన చిత్రం ‘KJQ’  (కింగ్ జాకీ క్వీన్). ఎస్‌‌ఎల్‌‌వీ సినిమాస్ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే  గత ఏడాది కన్నుమూశారు. ఆయనకు  సినిమాపై ఉన్న  ప్యాషన్, విజన్‌‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ఆగస్టు 7న  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

1990 బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగిన  ట్రైలర్ ప్రారంభం  నుంచే ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది.  దావూద్ ఇబ్రహీం, అజ్మల్ కసబ్, మదర్ థెరిసా వంటి వ్యక్తుల ఉదాహరణలతో... పరిస్థితులే ఒక మనిషిని విలన్‌‌గా, మహాత్ముడిగా లేదా సాధారణ వ్యక్తిగా మలుస్తాయనే భావనను బలంగా వినిపిస్తుంది. 

అదే ఆలోచన చుట్టూ తిరిగే ముగ్గురు ప్రధాన పాత్రల ప్రయాణాన్ని ఇందులో చూపించారు.  స్నేహం, అధికారం, అహంకారం, ద్రోహం, ప్రతీకారం... ఈ ఐదు భావోద్వేగాల చుట్టూ సినిమా  ఉండనుందని తెలుస్తోంది.  దీక్షిత్ శెట్టి తన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో  ఆకట్టుకోగా, శశి ఓదెల, యుక్తి తరేజా పాత్రలు  కథలో కీలక మలుపులకు కారణమయ్యేలా కనిపిస్తూ ఆసక్తిని పెంచారు.