దేవ్ ఆనంద్ కుటుంబంలో విషాదం.. కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

దేవ్ ఆనంద్ కుటుంబంలో విషాదం.. కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

బాలీవుడ్ లెజెండ్ సర్గీయ దేవ్ ఆనంద్ కుటుంబంలో త్రీవ విషాదం నెలకొంది. ఆయన కుమారుడు, నటుడు,దర్శకుడు సునీల్ ఆనంద్( 70 ) కన్నుమూశారు. లండన్ లో జూలై26.2026న గుండెపోటుతో మరణించారు. ఈ వార్తతో సినీ అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవ్ ఆనంద్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సునీల్ మరణం నవకేతన్ ఫిల్మ్స్ కుటుంబానికి తీరని లోటుగా మారింది.

సునీల్ మృతి విషయాన్ని ఆయన మేనకోడలు జినా నారంగ్ అధికారికంగా ధృవీకరించారు. మా కుటుంబం ఎంతో బాధలో ఉంది. ఈ క్లిష్ట సమయంలో అందరూ అందిస్తున్న ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబానికి కొంత గోప్యత ఇవ్వాలని మనవి చేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.

1984లో విడుదలైన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, తండ్రి-కొడుకులు కలిసి నటించడం విశేషం. అనంతరం 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే' వంటి చిత్రాల్లో నటించారు.  కొంతకాలం సునీల్ సినిమాలకు దూరంగా ఉన్నారు.

►ALSO READ | Michael OTT Release: ఉచితంగా ఓటీటీలోకి' మైఖేల్'.. రూ.10 వేల కోట్లు కొల్లగొట్టిన బయోపిక్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 ఆ తర్వాత 'మాస్టర్' చిత్రంతో నటుడిగానే కాక దర్శకుడిగానూ తిరిగి వచ్చారు. ఆ తర్వాత 2008లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'వగాటర్ మిక్సర్'లో నటించి, దర్శకత్వ బాధ్యతలూ నిర్వహించారు. అయితే ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అయితే, తండ్రిలా స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయారు.

సునీల్ నటుడిగానే కాకుండా, దేవ్ ఆనంద్ స్థాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిల్మ్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ నుంచి చివరిసారిగా 2011లో విడుదలైన 'చార్జ్‌షీట్'లో దేవ్ ఆనంద్ ప్రధాన పాత్ర పోషించారు. అదే ఏడాది డిసెంబర్‌లో దేవ్ ఆనంద్ మరణించగా, ఇప్పుడు సునీల్ కూడా కన్నుమూయడంతో బాలీవుడ్‌లో ఒక సినీ వారసత్వానికి చెందిన మరో అధ్యాయం ముగిసిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ..