ములుగు మంగపేటలో టోర్నడో : వేర్లతో సహా కూలిన పెద్ద పెద్ద చెట్లు

ములుగు మంగపేటలో టోర్నడో : వేర్లతో సహా కూలిన పెద్ద పెద్ద చెట్లు

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  ములుగు జిల్లాలో సంభవించిన భీకర ఈదురుగాలులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు.ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపెల్లి శివారులో టోర్నడో బీబత్సం సృష్టించింది. సుమారు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ వృక్షాలు వేళ్లతో సహా నేలకూలాయి. కేవలం గంటపాటు పడిన భారీ వర్షం, భయంకరమైన ఈదురుగాలులకు పదుల సంఖ్యలో చెట్లు నేలవాలాయి.

వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటం, రహదారులపై చెట్లు అడ్డుగా పడిపోవడంతో అటవీ శాఖ అధికారులు ఇంకా ఆ ప్రాంతాన్ని సందర్శించలేకపోయారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే ఆస్తి నష్టం  ఇతర వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

►ALSO READ | మెదక్ జిల్లాలో ఉప్పొంగుతున్న మంజీరా.. నిండిన ఘనపూర్ ఆనకట్ట

రెండేళ్ల క్రితం తాడ్వాయి మండలం మేడారం సమీపంలో వందలాది ఎకరాల్లో చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి పరిస్థితులే మళ్లీ పునరావృతం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ టోర్నడో ధాటికి జరిగిన నష్టానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.