మెదక్ జిల్లాలో ఉప్పొంగుతున్న మంజీరా.. నిండిన ఘనపూర్ ఆనకట్ట

మెదక్ జిల్లాలో ఉప్పొంగుతున్న మంజీరా.. నిండిన ఘనపూర్ ఆనకట్ట


గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని మంజీరా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లాలోని ప్రముఖ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్ట్‌ అయిన ఘనపూర్ ఆనకట్ట నిండుకుండలా మారి, మంజీరా నది ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తోంది.

ఈ ఘనపూర్ ఆనకట్ట పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఎగువ నుండి వస్తున్న వరద ఉధృతితో ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండింది. నది పరవళ్ళు తొక్కుతుండటంతో స్థానిక రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : ఆమె మనిషి అనుకున్నావా..?

అయితే  వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున, నది పరీవాహక ప్రాంతాల ప్రజలు మరియు మంజీరా తీర ప్రాంతాల మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టారు. నదిని దాటడం గానీ, చేపల వేటకు వెళ్లడం గానీ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.