కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారు. గత ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేసిందని, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా భారీ ఎత్తున బకాయిలు పెట్టిందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ప్రతినెలా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తుందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 5వేల 430 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఎగ్గొట్టిందని ఆరోపించారు. రూ.5వేల 430 కోట్ల బకాయిలు పెట్టిందని అన్నారు. గత ప్రభుత్వం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చెల్లించకపోతే మా ప్రభుత్వం చెల్లించిందని అన్నారు సీఎం. ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా విద్యార్థులకు రూ. 200 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు సీఎం. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాలేజీల యాజమానులను పార్టీలోని చేర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రికి చెందిన యూనివర్సిటీ ఖాతాల్లో 400 కోట్లు ఉన్నాయన్నారు.
ఫేస్ రికగ్నైజ్మెంట్ తో కాలేజీలను మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు సీఎం. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండేటా చర్యలు చేపట్టామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేయమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర గైడ్ లైన్స్ లోనే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామన్నారు. విద్యార్థుల అకౌంట్లలోనే నేరుగా రీయింబర్స్ మెంట్ వేస్తామని చెప్పారు. తెలంగాణలో విద్యాభివృద్దికి టాటా సంస్థ రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు సీంఎం.
ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులను సీఎం రేవంత్ రెడ్డి సభకు వివరించారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రాభివృద్దికోసం ఢిల్లీ కి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్నారు. విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దన్నారు. విద్యార్థులు భాషలు నేర్చుకోవాలి. జపనీస్ భాష నేర్చుకున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి, లక్షన్నర జీతంతో ఉద్యోగం పొందే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. .ఎంప్లాయిమెంట్ ,ఇన్నోవేషన్పై ఫోకస్ చేయాలన్నారు.
