ఆమె మనిషి అనుకున్నావా..? లేక... నడిరోడ్డు మీద బైక్ పై... భార్యను ఈడ్చుకెళ్ళిన భర్త...

ఆమె మనిషి అనుకున్నావా..? లేక... నడిరోడ్డు మీద బైక్ పై... భార్యను ఈడ్చుకెళ్ళిన భర్త...

ఆలుమగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అసలు గొడవలే లేకపోతే... ఒకానొక టైంకి బోర్ కొడుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా కూడా నాలుగు గోడల మధ్యనే క్లియర్ చేసుకోవాలి కానీ రచ్చకెక్కకూడదు అని పెద్దలు చెబుతుంటారు. అయితే... భార్యతో ఏం గొడవపడ్డాడో ఏమో కానీ..  బీహార్ లో ఓ సైకో భార్యను అంటారు చూస్తుండగా.. నడిరోడ్డుపై బైక్ పై ఈడ్చుకెళ్ళి పశువు కంటే హీనంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బీహార్‌లోని నలంద జిల్లా రాజ్‌గిర్‌లోని కిలా మైదాన్, వేణువన్ సమీపంలో జరిగింది ఈ ఘటన. కదులుతున్న బైక్ పై భార్యను పట్టుకొని రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్ళాడు సైకో. ఇది గమనించిన ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా కొద్ది దూరం వెళ్ళాక బైక్ బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు సైకో.

ఈ క్రమంలో పక్కన ఉన్నవారంతా సైకో భర్తకు దేహశుద్ది చేశారు. వీడియోపై రకరకాల కామెంట్స్ తో రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఆ సైకోకి తగిన బుద్ది చెప్పాలని...జీవితంలో మళ్ళి భార్య మీదికి చేయి ఎత్తాలంటేనే భయపడేలా చేయాలని కామెంట్ చేస్తున్నారు.