మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్-ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీ శ్రీ'. ఈ మూవీపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. యువ దర్శకుడు రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్‌తో పూజా హెగ్డే తొలిసారి జోడీ కట్టింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్‌కు మంచి స్పందన రాగా లేటెస్ట్ గా చిత్రబృందం తొలి పాట 'బొమ్మ బొమ్మ'ను విడుదల చేసింది. ఈ పాటలో రైల్వే స్టేషన్‌లో తొలిచూపులోనే పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడే దుల్కర్ పాత్రను ఎంతో అందంగా చూపించారు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో, అందమైన క్షణాలతో ఎలా ముందుకు సాగుతుందో ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.
జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ మొదటి వినికిడిలోనే మనసును తాకేలా ఉంది. సింపుల్ ట్యూన్‌కు క్లాసీ ఆర్కెస్ట్రేషన్ జోడించడంతో పాట మరింత మధురంగా వినిపిస్తోంది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రేమ భావాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరుస్తుండగా, కపిల్ కపిలన్ తన మధురమైన గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రామ్ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ కూడా పాటకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది.
►ALSO READ | కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!
అత్యంత అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటలో దుల్కర్–పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్, సంగీతం, నటీనటుల హావభావాలు కలిసి ప్రేక్షకులకు ఫీల్-గుడ్ అనుభూతిని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా కూడా ప్రేమకథల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న 'శ్రీ శ్రీ' త్వరలో పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
