'ఢీ' షోతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసు వ్యవహారం రోజుకో ఊహించని మలుపు తిరుగుతోంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రాజు ఓ యువతితో మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో క్లిప్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి నెలకొంది.
లీకైన ఆడియో ప్రకారం.. శిరీష అనే అమ్మాయితో రాజు తీవ్రంగా బేరసారాలు ఆడుతున్నట్లు వినిపిస్తోంది. నా వల్ల కావడం లేదు.. నన్ను వదిలేయడానికి రూ. 5 లక్షలు ఇస్తా, ప్లీజ్ ఓకే చెప్పు శిరీష. మనం ఫ్రెండ్స్‌లా ఉందాం అని రాజు బతిమాలుతుండగా.. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, వేరే అమ్మాయితో నిన్ను చూస్తూ భరించలేను అని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది.
మరోవైపు ఆ యువతి కూడా.. నేను 4 ఏళ్లుగా కష్టపడి సంపాదించిన రూ. 30 లక్షలు ఉన్నాయి. నువ్వు మనసు మార్చుకుని నా దగ్గరకి వస్తే నీ చేతిలో రూ. 50 లక్షలు పెడతా.. మనం కారు కొనుక్కోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు అని ఎమోషనల్ అయినట్లు ఆ సంభాషణలో ఉంది. పైగా రాజు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ప్రశ్నిస్తూ.. డ్యాన్స్ మాస్టర్ చిట్టికి ఏం సమాధానం చెప్తావని నిలదీసింది.
►ALSO READ | నానక్‌రామ్‌గూడ భూ వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు
ఇక అసలు కేసులో మాత్రం ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వేధించడంతో పాటు రూ.12 లక్షలకు పైగా తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. మియాపూర్ పోలీసులు సెప్టెంబర్ 9న కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించగా, బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం.
అయితే ఈ లీకైన ఆడియోలోని వాయిస్ నిజంగానే 'ఢీ' రాజుదేనా లేదా అనేది పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఈ లీక్డ్ సంభాషణ నెట్టింట వైరల్ అవ్వడంతో.. అసలు ఆ శిరీష ఎవరు? ఇండస్ట్రీకి చెందిన కోరియోగ్రాఫరా లేక బయటి వ్యక్తినా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది.
“If you agree, I’ll treat you like a king!” ❤️🔥
— Janya Digital Media (@janyamedia1) September 15, 2026
A purported audio call involving Dhee Show dancer Raju has surfaced.
Raju reportedly pleaded with Shireesha, saying he would return her money, marry another girl, but remain friends with her.
Shireesha, however, said she truly… pic.twitter.com/K4WDimJhxt
