Allu Arjun: 'నచ్చకపోతే వదిలేయండి.. హేట్ చేయొద్దు'.. ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ పొలిటికల్ మెసేజ్!

Allu Arjun: 'నచ్చకపోతే వదిలేయండి.. హేట్ చేయొద్దు'.. ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ పొలిటికల్ మెసేజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ శౌర్య భవన్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ..  మీ అందరికీ వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పలేకపోయినా.. మీరంతా నా హృదయంలో ఉన్నారు. Keep The Fire On అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉందన్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, హేట్ కల్చర్‌పై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషి జీవితాన్ని 100 శాతం బ్యాటరీలా భావించాలి. రోజూ మనకు 100 శాతం సమయం, శక్తి లభిస్తాయి. ఆ ఎనర్జీని ఎలా వినియోగించుకోవాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందన్నారు.

 ఎవరో నచ్చలేదని వారిని ట్రోల్ చేస్తూ, ద్వేషిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు అంటూ ఫ్యాన్స్ సందేశం ఇచ్చారు.. మీ లక్ష్యాలు, కుటుంబం, కెరీర్, మీకు ఆనందం ఇచ్చే పనులపై దృష్టి పెట్టండి. నచ్చని వ్యక్తుల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని బన్నీ స్పష్టం చేశారు. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నుంచోని వెయిట్ చెయ్ .. కనీసం నువ్వు అయినా సంతృప్తి పడతావు. 'నచ్చకపోతే వదిలేయండి.. కానీ హేట్ చేయొద్దు!' అన్నారు..

 

బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై పెరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అభిమానులు మాత్రం 'ఇది హేటర్స్‌కు క్లాస్ కాదు.. జీవితానికి ఇచ్చిన గొప్ప మెసేజ్'అంటూ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఇది బన్నీ తొలి పొలిటికల్ మెసేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు 

ALSO READ : ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఐటమ్ నెంబర్..

ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నారు.