శ్రీలంక టూర్‌కి భారత జట్టు కోచ్ ఎవరు?.. గంభీర్ లేదా లక్ష్మణ్!

శ్రీలంక టూర్‌కి భారత జట్టు కోచ్ ఎవరు?.. గంభీర్ లేదా లక్ష్మణ్!

Gautam Gambhir vs VVS Laxman: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి ఈ సిరీస్‌కి హెడ్ కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు క్రీడాభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇండియన్ టీమ్ జింబాబ్వేను 3–0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంతో, లక్ష్మణ్‌నే పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. 

శ్రీలంక టెస్ట్ సిరీస్‌కి అతడే హెడ్ కోచ్: 

అయితే ఈ ఊహాగానాలన్నింటికీ స్వస్తి పలుకుతూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. జింబాబ్వే సిరీస్ నుంచి గంభీర్‌కు రెస్ట్ ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం.. ఈ కీలకమైన శ్రీలంక టెస్ట్ సిరీస్‌కి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల దృష్ట్యా లంక పర్యటన భారత్‌కు చాలా ముఖ్యమైంది.  

రెడ్ బాల్ క్రికెట్‌లో గంభీర్ ముందున్న సవాల్: 

గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఏమాత్రం అస్సలు బాగాలేదు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3–1తో కోల్పోయింది. కేవలం ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌ను మాత్రమే సమం (Draw) చేసుకుంది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో ఇండియా 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. 2027 WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకూ ప్రతీ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. 

►ALSO READ | టీ20 వరల్డ్‌కప్‌లో 24 జట్లు?.. ఐసీసీ మెగా ప్లాన్ రెడీ!

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా(ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక), కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్