The Paradise: ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. ఉర్రూతలూగించిన ఫోక్ సాంగ్తో ఓదెల..!

The Paradise: ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. ఉర్రూతలూగించిన ఫోక్ సాంగ్తో ఓదెల..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి సెన్సేషనల్ హింట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

జడల్తో హడల్ పుట్టించేలా కీర్తి ఐటెం సాంగ్

నాని గత చిత్రాల కంటే భిన్నంగా, ఈ సినిమాలో ఆయన మాస్ మేకోవర్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఇటీవలే నాని ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’ యూట్యూబ్లో రిలీజై దుమ్మురేపింది. ఏకంగా 200 మిలియన్ల వ్యూస్తో రికార్డ్ బద్దలు కట్టింది. ఈ క్రమంలోనే మరో క్రేజీ టాక్ బయటకొచ్చి నాని ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం. జడల్తో హడల్ పుట్టించేలా స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేయనుందని టాక్. ముఖ్యంగా తెలంగాణ ఫోక్ ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన ఓ ఫెమస్ సాంగ్తో శ్రీకాంత్ మ్యాజిక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మించగా, దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు ఆట సందీప్ కొరియోగ్రఫీ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ అదిరిపోయే ట్యూన్ సెట్ చేశారని సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. 

‘ఆయా షేర్’ సంచలనం..

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సాంగ్ని ఏకంగా దాదాపు 600 మంది డ్యాన్సర్ల మధ్య, అత్యంత భారీగా వేసిన సెట్‌లో చిత్రీకరించారు. అనిరుధ్ రవిచందర్ తనదైన మార్కు ఎలక్ట్రిక్ మాస్ ట్యూన్‌తో ఈ పాటను అదరగొట్టగా.. నాని సిగ్నేచర్ స్టెప్పులు, హై-వోల్టేజ్ యాక్షన్ మూమెంట్స్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి.

►ALSO READ | Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!

ఈ పాటకు విజయ్ జన నాయగన్’ ఫేమ్ సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించి టాలీవుడ్ మేకర్స్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఈ లేటెస్ట్ రెండో సింగిల్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ అని చిత్ర యూనిట్ ధీమాగా ఉందని తెలుస్తోంది. అయితే, ఆ ఫోక్ సాంగ్ ఏంటనేది తెలిసే వరకు నాని ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు సుమా!

ఇదిలా ఉంటే, గతంలో నాని-కీర్తి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ భారీ విజయాన్ని సాధించడంతో, ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 అగస్ట్ 21న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఏదేమైనా అనిరుధ్-నాని-శ్రీకాంత్ పెంచుతున్న అంచనాలు టాలీవుడ్ని షేక్ చేసేలా ఉండబోతున్నాయి.