Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!

Aarti Ravi Divorce: రూ.40 లక్షలు కాదు.. రూ. 3 లక్షలే భరణం.. ఆర్తి-రవి మోహన్ కేసులో కోర్టు షాకింగ్ తీర్పు!

తమిళ స్టార్ హీరో రవి మోహన్ - ఆయన భార్య ఆర్తి రవి విడాకుల కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. గత కొంతకాలంగా కోర్టుల్లో సాగుతున్న ఈ హైప్రొఫైల్ లీగల్ వివాదంలో లేటెస్ట్ గా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రతి నెల ఇవ్వాల్సిన మధ్యంతర భరణంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

రూ.40 లక్షల డిమాండ్‌..

విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు తనకు, పిల్లల పోషణ కోసం ప్రతి నెల రూ.40 లక్షలు మధ్యంతర భరణంగా ఇవ్వాలని ఆర్తి రవి కోర్టును ఆశ్రయించింది. పిల్లల చదువు, ఇంటి నిర్వహణ, రోజువారీ ఖర్చులన్నీ తానే భరిస్తున్నానని, తగిన ఆర్థిక సహాయం అందడం లేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఆర్తి చేసిన రూ.40 లక్షల డిమాండ్‌ను కోర్టు పూర్తిగా అంగీకరించలేదు. 

ప్రతి నెల రూ.3 లక్షలు భరణం..

అయితే ప్రతి నెల రూ.3 లక్షలు మధ్యంతర భరణంగా చెల్లించాలని రవి మోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. విడాకుల కేసు తుది తీర్పు వెలువడే వరకు ఈ మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆర్తి రవి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టులో తన భరణం పిటిషన్ విచారణ ఆలస్యమవుతోందని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అటు విచారణకు మరింత సమయం ఇవ్వాలని రవి మోహన్ చేసిన విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించింది.

ALSO READ : రాజకీయాల వైపు క్యూ కడుతున్న హీరోలు..

2009లో రవి మోహన్- - ఆర్తి  ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే దాదాపు 15 ఏళ్ల వైవాహిక జీవితానంతరం విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇరు పక్షాలు తమ వాదనలు కోర్టులో కొనసాగుతున్నాయి. అయితే లేటెస్ట్ భరణం ఉత్తర్వు కేవలం తాత్కాలిక ఏర్పాటే తప్ప, విడాకుల కేసుపై తుది తీర్పు కాదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.