ఏపీలో సంచలనం సృష్టించిన కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును విచారించేందుకు సిట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయవాడలోని సిట్ ఆఫీసులో సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థాన అనుమతినిచ్చింది. హైకోర్టు ఇచ్చిన గత ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కోర్టు విధించిన మిగిలిన షరతులు అన్నీ యథావిధిగా కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
►ALSO READ | నాణ్యమైన బియ్యం 52 రూపాయలే : కొత్త స్కీం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్
ఈ నేపథ్యంలో, రేపటి(జులై 28) నుంచే సీఐ నాగరాజును తమ అదుపులోకి తీసుకోనున్న సిట్ అధికారులు.. సుదీర్ఘంగా విచారించనున్నారు. సాయికృష్ణ మృతికి సంబంధించి కీలక విషయాలను రాబట్టేందుకు ఈ కస్టడీ విచారణ అత్యంత కీలకంగా మారనుంది.
