సూరి–సుహాస్ 'మండాడి' మాస్ జాతర.. సక్సెస్ జోష్‌లో మూవీ టీమ్!

సూరి–సుహాస్ 'మండాడి' మాస్ జాతర.. సక్సెస్ జోష్‌లో మూవీ టీమ్!

తమిళ హీరో సూరి, టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'మండాడి'.  సెప్టెంబర్ 10న విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  తమిళం, తెలుగు  ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో హౌస్‌ఫుల్స్ సందడి నెలకొంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్రబృందం నిర్వహించిన యునానిమస్ బ్లాక్‌బస్టర్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. 

ఈ కార్యక్రమంలో హీరోలు, దర్శకుడు, నిర్మాతతో పాటు ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధులు పాల్గొని సక్సెస్ జోష్‌ను పంచుకున్నారు. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సూరి, సుహాస్‌తో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

 తెలుగు ప్రేక్షకులు తనపై, 'మండాడి'పై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు హీరో సూరి. సినిమా విడుదలకు ముందే మైత్రి నవీన్, రవి సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారని, వారి నమ్మకం ఇప్పుడు నిజమైందని అన్నారు. తన సహనటుడు సుహాస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు సుహాస్. దర్శకుడు మదిమారన్, సూరితో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

మైత్రి నవీన్, రవి, శశి మాట్లాడుతూ.. సినిమాపై ముందుగానే నమ్మకం ఏర్పడిందని తెలిపారు. మూడో రోజుకే సుమారు 100 స్క్రీన్లు పెంచామని, పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్స్ నమోదవుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా సూరి–సుహాస్ కాంబినేషన్, బోట్ రేస్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పారు.

నిర్మాత ఎల్రెడ్ కుమార్, దర్శకుడు మదిమారన్ మాట్లాడుతూ మంచి కంటెంట్‌కు భాషా హద్దులు ఉండవని 'మండాడి' మరోసారి నిరూపించిందన్నారు. మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ కూడా తెలుగు ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోష్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 'మండాడి' మరిన్ని వండర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.