Aadarsha Kutumbam Teaser: అప్పులతో మొదలై.. ఐశ్వర్యం వరకు.. ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ రిలీజ్

Aadarsha Kutumbam Teaser: అప్పులతో మొదలై.. ఐశ్వర్యం వరకు.. ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ రిలీజ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న క్రేజీ కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్: 47 / AK 47)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో టీజర్ రిలీజై మరింత ఆసక్తిని పెంచేసింది. 

ఆసక్తికరంగా ‘ఆదర్శ కుటుంబం’ టీజర్..

తాజాగా విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వెంకటేష్‌ను సరికొత్త లుక్, క్యారెక్టర్‌లో చూపిస్తూ త్రివిక్రమ్ తనదైన ఎంటర్‌టైన్‌మెంట్ టచ్‌ను జోడించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఫ్యామిలీ సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

టీజర్ స్టార్ట్ అవుతూనే వెంకీ మామ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ రైటింగ్తో అట్ట్రాక్ట్ చేసేసింది. వెంకటేష్ చెబుతూ.. ‘డబ్బుకి, సబ్బుకి ఓ పోలిక ఉంది. డబ్బు చూస్తుండగానే కరిగిపోతుంది.. సబ్బు ఆలోచించేలోపే అరిగిపోతది..’ అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ఇదే క్రమంలో హీరోయిన్ ఎంట్రీ డైలాగ్ ఇస్తూ.. ‘నా అప్పు 4 లక్షలు, వాడి అప్పు 2 లక్షలు..’ అని అనగా.. ఆ వెంటనే తమ ముద్దుల కొడుకు మాట్లాడుతూ.. ఆ రెండు కలిపి మొత్తం 7 లక్షలు అని చెబుతాడు. ఇక వెంకీ ఫ్యామిలీ విచిత్ర తీరుతో ఫ్రస్ట్రేషన్లో చెంపలపై కొట్టుకోవడం.. ఆ తర్వాత ‘4+2 కలిపితే.. 6 లక్షలు అని.. వీడికి చదువు దండగ’ అని చెప్పడం ఆకర్షిస్తుంది.. 

ఇక వెంకీ వంటింట్లో వంట చేసి వస్తూ.. ‘కూర, సాంబారు చేసాను.. అని అనగా.. సోఫాలో తీరిగ్గా కూర్చుని ఉన్న శ్రీనిధి శెట్టి.. ‘అయ్యో పప్పు చేయలేదా..’ అని అంటుంది. ఆ వెంటనే ‘నువ్వు అందించిన చోటల్లా అప్పు చేయ్.. నేను పప్పు చేస్తాను..’ అని అనడంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ తర్వాత ‘అడుక్కున్నోళ్లకు కూడా ఆదివారం ఉంటుంది కానీ, ఈ అప్పుల్లోళ్ళకు మాత్రం ఉండదు..’ అని చెప్పడం సినిమా టోన్ చెబుతుంది.. ఇక ఇదే సమయంలో ఉన్నట్టుండిగా.. వెంకీ ఫ్యామిలీ డూప్లెక్స్ AK 47 హౌస్ లోకి చేంజ్ అవ్వడం.. క్రైమ్ ఇన్సిడెంట్, విలన్స్ ఎంట్రీ ఇవ్వడం.. కథను టర్న్ చేసింది. 

టీజర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ, కామెడీ ట్రాక్ సినిమాను పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉండబోతోందో టీజర్ ఓ మంచి క్లారిటీ ఇచ్చింది. దీంతో సినిమా కోసం అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ తారాగణంతో సినిమా..

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, పెద్ది’ఫేమ్ దివ్యేందు శర్మ, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మంచి వైబ్‌ను తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది.

అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’..

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ALSO READ : వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!

వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి టీజర్‌తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.