చివరి శ్వాస వరకు కాంగ్రెస్‎లోనే.. రాజీనామా వార్తలను ఖండించిన మాజీ సీఎం హరీష్ రావత్

చివరి శ్వాస వరకు కాంగ్రెస్‎లోనే.. రాజీనామా వార్తలను ఖండించిన మాజీ సీఎం హరీష్ రావత్

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఉత్తరాఖాండ్ మాజీ సీఎం హరీష్ రావత్ రాజీనామా వార్తలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియాలో వస్తో్న్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. 

పార్టీని వీడే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన రక్తంలోనే ఉందని.. చివరి శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసు బనాయించిందని ఆరోపించారు. తన వల్ల కాంగ్రెస్‎కు ఏమైనా చెడ్డపేరు వస్తే వెంటనే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. 

2016లో హరీష్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒక పరీక్షల అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయన వ్యక్తిగత సహాయకుడు చందన్ సింగ్ జీనా నివాసాలపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో దాదాపు రూ.32 లక్షల నగదు, బంగారం, విలాసవంతమైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. 

తన పీఏపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావత్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రిజైన్ చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.  ఈ క్రమంలో తన రాజీనామా వార్తలను హరీష్ రావత్ ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయలేదని వివరణ ఇచ్చారు.