బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా 2026 సెప్టెంబర్ 12న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఇండియా-చైనా మధ్య ఉన్న విభేదాలను వివాదాలగా మారకుండా నిరోధించాలని ఇద్దరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా-చైనా ద్వైపాక్షిక భేటీ 2025 ఆగస్టులో తియాంజిన్ లో జరిగింది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించి, బోర్డర్ లో వివాదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ, జిన్ పింగ్ ఇరువురు వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. చర్చల ద్వారా పరస్పర సహకారానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా ఇరువురు చర్చించారు.
ద్వైపాక్షిక చర్చలలో సరిహద్దు సమస్య ప్రధానాంశంగా నిలిచింది. సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతత అత్యవసరమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. సరిహద్దు సంబంధిత విషయాలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలకు కట్టుబడి ఉండాలని ఆయన ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, తమ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరిహద్దు సమస్యను పరిగణనలోకి తీసుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటితో పాటు ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య అంశాలను కూడా సులభతరం చేసుకోవాలని చర్చించారు. వాణిజ్యం, సప్లై చైన్ పై చర్చించారు. అదే విధంగా పెట్టుబడుల విషయంలో కూడా ఆమోదయోగ్యంగా నిర్ణయానికి రావాలని, పరస్పరం సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
జిన్ పింగ్ 2019 తర్వాత భారత్ కు రావడం ఇదే తొలిసారి. చెన్నైలోని మామల్లపురమ్ దగ్గర ఇరువురు అనధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సీరియస్ గా మారిపోయాయి.
