నాణ్యమైన బియ్యం 52 రూపాయలే : కొత్త స్కీం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్

నాణ్యమైన బియ్యం 52 రూపాయలే : కొత్త స్కీం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్

 రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించేందుకు , సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల భారాన్ని తగ్గించేందుకు  ఏపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  ఆగస్టు 1 నుంచి పౌర సరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం (BPT Superfine Rice) కేజీ రూ. 52,  గ్రేడ్-1 పచ్చి బియ్యం (Raw Rice) కేజీ రూ. 50 కి అందించనున్నట్లు తెలిపారు.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతు బజార్లు,  500 మంది రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్కెట్ ధరలను క్షుణ్ణంగా పరిశీలించి, రైస్ మిల్లర్లతో పలుమార్లు జరిపిన చర్చల అనంతరం ఈ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ALSO READ : 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట.

సామాన్యులకు ఆర్థిక భారం కాకుండా నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనుందని తెలిపారు పవన్.