ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం (అల్లూరి సీతారామరాజు) జిల్లా రంపచోవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముర్రం శివాని అనే విద్యార్థిని తన ఇంటివద్ద రేకు షెడ్డు కింద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సరిగ్గా మూడు రోజుల క్రితం అంటే జులై 24న రంపచోవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే కూర్చుని ఎంతో ఉత్సాహంగా ముచ్చటించింది శివాని. తన చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి సీఎంతో స్వయంగా మాట్లాడిన ఆ గిరిజన బిడ్డ... ఇంతలోనే అనూహ్యంగా తనువు చాలించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. డాడీ మీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా.. నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులపై తనకున్న ప్రేమను ఆ నోట్‌లో శివాని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులందరూ కలిసిమెలసి ఉండాలని కోరుతూ రాసిన ఆ చివరి మాటలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించడం తనను కలచివేసిందని తెలిపారు. శివాని మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. సమస్యలు ఏవైనా సరే విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఎదుర్కొని కలలను నిజం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv
— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026
