హైదరాబాద్ చుట్టు పక్కల ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్.. ఈ కలర్స్తో చేసిన ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా!

హైదరాబాద్ చుట్టు పక్కల ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్.. ఈ కలర్స్తో చేసిన ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా!

ఆహార కల్తీ, అపరిశుభ్రతతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీళ్లో స్పీడ్ పెంచారు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ వెలుపల మొత్తం 46 ఫుడ్ సంస్థల్లో రైడ్స్ జరిపారు. రెస్టారెంట్లు, బేకరీలు, ధాబాలు, హోటళ్లు, స్వీట్ షాపులు, హాస్టళ్లలో జరిపిన తనిఖీల్లో నిర్వహణ చూసి అధికారులు షాకయ్యారు.

పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కలుషిత మాంసం, కుళ్లిన కూరగాయలు ఉన్నట్లు గుర్తించారు.  పలు సంస్థల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద ఉన్నట్లు పేర్కొన్నారు. కిచెన్ అపరిశుభ్ర వాతావరణంలో ఉండగా.. రికార్డుల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించారు.

వెజ్, నాన్‌వెజ్ ఆహారాన్ని వేర్వేరుగా స్టోర్ చేయకుండా.. సెగ్రిగేషన్ లేకుండా ఒకే చోట రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. ఎక్స్‌పైర్డ్ ఫుడ్, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు చూసి ఆందోళకు గురయ్యారు. 

ఫుడ్ హ్యాండ్లర్ల వ్యక్తిగత పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద కల్తీపై 22 ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. నిబంధనలు పాటించని 23 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందజేశారు. 

మళ్లీ తనిఖీలు చేసి.. నిబంధనలు పాటించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు 3 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

మహేంద్ర మీల్స్, బిర్యానీ అండ్ కర్రీ పాయింట్ – స్టేషన్ ఘన్‌పూర్, శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి  బావుపేట, కరీంనగర్, చాచా ఫ్యామిలీ ధాబా – NH-65, తూప్రాన్‌పేట్, చౌటుప్పల్ తో పాటు పలు రెస్టారెండ్లు, హోటళ్లలో  TG సేఫ్ తనిఖీలు నిర్వహించారు.