స్వతంత్ర భరద్వాజ్ పై సుప్రీంకోర్టు సీరియస్.. మైనర్ పై వేధింపుల కేసులో నివేదికకు ఆదేశం

స్వతంత్ర భరద్వాజ్ పై  సుప్రీంకోర్టు సీరియస్.. మైనర్ పై వేధింపుల కేసులో నివేదికకు ఆదేశం

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో పాల్గొన్న మైనర్ తండ్రిపై దాడి కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల్లో దాడి తర్వాత కూడా భరద్వాజ్, అతని అనుచరులు బాధితురాలిని రేప్ చేస్తామని బెదిరించడం వంటి వేధింపులపై నివేదిక ఇవ్వాలని కోరింది.  ఇటివంటి చర్యలను సహించేది లేదని, మైనర్  విద్యార్థిని , ఆమె తండ్రిని  భరద్వాజ్ అనుచరులు బెదిరించడం, వేధించడం  అంత తేలికగా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 

జూన్ 23 న నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో బాధితురాలు CJP నిరసనల్లో పాల్గొన్న విద్యార్థిని నిషు ఆజాద్ ,ఆమె తండ్రి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆ సమయంలో స్వతంత్ర భరద్వాజ్, అతని అనుచరులు సంజయ్ కుమార్‌ , అతని మైనర్ కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ.. తానే స్వయంగా CJP కార్యకర్త తండ్రి తల పగలగొట్టానని, అయినా పోలీసులు తనను అరెస్ట్ చేయలేదని గొప్పలు చెప్పుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తీవ్ర ప్రజా నిరసనలకు దారితీసింది.
భరద్వాజ్ కామెంట్స్ పై CJP , విపక్ష నేతలు ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తేవడంతో అతనిపై హత్యాయత్నం, SC/ST చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

అయితే బాధితురాలైన మైనర్ కు సోషల్ మీడియా ద్వారా అత్యాచార బెదిరింపులు, ఆన్‌లైన్ వేధింపులు రావడంతో భరద్వాజ్‌పై ఢిల్లీ పోలీసులు అదనంగా పోక్సో (POCSO) చట్టం, స్టాకింగ్ క్రిమినల్ బెదిరింపుల కింద మరో FIR నమోదు చేశారు.

యూపీలోని బులంద్‌షహర్‌లో సెప్టెంబర్ మొదటి వారంలో భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణ అనంతరం ప్రస్తుతం అతను 14 రోజుల జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

ALSO READ : ఏడేళ్ల తర్వాత.. ఇండియాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

ఈ వివాదంలో విద్యార్థులపై నమోదైన FIRలను కొట్టివేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ, గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్ బాధిత మైనర్ కు నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులను భయభ్రాంతులకు గురిచేసేలా జరుగుతున్న వేధింపులను అస్సలు సహించేది లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  బాధితురాలిపై భరద్వాజ్ అనుచరుల వేధింపులపై నివేదిక ఇవ్వాలని కోరింది.