ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే కేవలం సినిమా.. బాక్సాఫీస్.. రికార్డులు మాత్రమే కాదు. సామాజిక సేవలోనూ ముందుంటారు. అటు ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్‌బేస్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. అభిమానాన్ని సెలబ్రేషన్స్‌కే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ తాము 'తగ్గేదేలే' అని నిరూపిస్తున్నారు . లేటెస్ట్ గా అల్లు అర్జున్ అభిమానులు చేపట్టిన ఓ భారీ సామాజిక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా HPVపై అవగాహన కల్పించే భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగా 8 రాష్ట్రాల్లో 820 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. దాదాపు 3 లక్షల మంది బాలికలకు HPV గురించి అవగాహన కల్పించారు..
స్కూళ్లు, స్థానిక కమ్యూనిటీలను కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో.. HPV అంటే ఏమిటి? దాని వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏమిటి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత ఎంత? వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో అర్హత కలిగిన వైద్య నిపుణుల సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.
సాధారణంగా స్టార్ హీరోల అభిమాన సంఘాలు సినిమా విడుదలలు, పుట్టినరోజు వేడుకలు, భారీ కటౌట్లు, సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ ఈసారి బన్నీ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి.. యువత ఆరోగ్యంపై అవగాహన కల్పించే అంశాన్ని ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. 820 కార్యక్రమాలు.. 3 లక్షల మంది బాలికలు.. 8 రాష్ట్రాలు.. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు. ఒక స్టార్‌పై ఉన్న అభిమానాన్ని సామాజిక బాధ్యతగా మార్చితే ఫ్యాన్ పవర్ ఎంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపగలదో ఈ కార్యక్రమం చూపిస్తోంది.
ఈ తరహా బృహత్తర కార్యక్రమం ఒక హీరో ఫ్యాన్ క్లబ్ ద్వారా జరగడం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఆల్-ఇండియా పాపులారిటీని, తన అభిమానుల బలగమైన 'ఫ్యాన్ పవర్'ను 'సోషల్ పవర్'గా మార్చి చూపించారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడే ఈ చొరవపై దేశవ్యాప్తంగా వైద్య రంగానికి చెందిన ప్రముఖులు , నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానం అంటే కేవలం విజిల్స్ వేయడమే కాదు, సమాజానికి మేలు చేయడమేనని అల్లు అర్జున్ ఆర్మీ మరోసారి చాటిచెప్పింది.
Kukatpally Alluarjun Fans Association,
— VSK Chowdary (@VSKchowdaryyyy) September 9, 2026
conducted the HPV Vaccine Awareness Drive at Sanathnagar Government school...!!
During This program We have guided benifits of HPV vaccine and How does it Fights Against Curvival Cancer.
Awareness.
Prevention.
Protection.
Together for… pic.twitter.com/cR1utr5BwM
