2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్

2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్

వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని అన్నారు. బుధవారం ( సెప్టెంబర్ 9 ) బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.

5 ఏళ్ల వైసీపీ పాలన, రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని... మన పాలనపై మన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా, ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగిందని అన్నారు జగన్. అలా ఏ ఇంటికి అయినా వెళ్లి, వైసీపీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని... మ్యానిఫెస్టోకు ఒక అర్ధం తీసుకొచ్చి, మొత్తం అమలు చేసిన చరిత్ర వైసీపీదని అన్నారు. 

చంద్రబాబు నాయుడు ఏకంగా మ్యానిఫెస్టోతో పాటు, ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంపారని... ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టో జాడ ఉండదని అన్నారు. తమమ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి 99 శాతం అమలు చేశామని... ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు జగన్.

చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని... ప్రతి ఇంటికి తన సంతకం, పవన్‌ సంతకంతో బాండ్లు పంపారని... తాము ఇచ్చిన పథకాలు మాత్రమే కాకుండా, ఇంకా మూడింతలు ఇస్తామని చెప్పారని అన్నారు. అమ్మ ఒడి కింద ఎంత మంది పిల్లలు ఉంటే, అన్ని రూ.15 వేలు ఇస్తామన్నారని... నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నాడు. ఆ పిల్లల అమ్మలు కనబడితే ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అన్నారని... రైతులకు రూ.26 వేలు ఇస్తానన్నారు, చేయూత కింద జగన్‌ ఏటా రూ.18వేల 750 మాత్రమే ఇస్తున్నాడు. అదే మేం వస్తే నీకు నెలకు రూ.4 వేల చొప్పున, ఏటా రూ.48 వేలు అన్నారని అన్నారు. 

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామని అన్నారు... ప్రతి ఇంటికి బాండ్లు పంపి, ప్రజలను దారుణంగా మోసం చేశాడని అన్నారు.  అదే ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని... వైసీపీ మోసం చేయలేదని... చెప్పింది చేశారని.. చంద్రబాబును నమ్మి మోసపోయామని అంటున్నారని అన్నారు జగన్.