ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పోలాల అమావాస్య పండుగ..

 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పోలాల అమావాస్య పండుగ..

పోలాల అమావాస్య పండుగ వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు రైతులు. 2026 సెప్టెంబర్ 10న గ్రామ గ్రామాన వైభవంగా వేడుకలు నిర్వహించారు.  పండుగ సందర్భంగా  ఎద్దులను అందంగా అలంకరించారు.  భసవన్నలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.  

పండుగ సందర్భంగా తాంసి గ్రామంలో  గ్రామదేవతల ఆలయంచుట్టు ఎద్దులను ప్రదక్షిణల చేయించారు.  ఎద్దులకు బూరెలను నైవేద్యంగా సమర్పించారు.  ఎద్దులు పార్వతి పరమేశ్వురుని ప్రతిరూపాలని పేర్కొంటూ పూజలు నిర్వహించారు.  ఎద్దులను పూజిస్తే పాడి పంటలు  దండిగా పండుతాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. 

ఇటు కామారెడ్డి జిల్లాలోనూ పొలాల అమావాస్య పండుగను నిర్వహించారు రైతులు. జుక్కల్ నియోజకవర్గం వర్గం లో ఘనంగా పండుగను చేశారు. పండుగను పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ మందిరం చుట్టూ ఎడ్లును, ఆవులు, లేగ దూడలతో ప్రదక్షిణలు చేశారు.