పాకిస్తాన్ తో యుద్ధం గెలిచి వచ్చారా?.. ప్రధాన్ కు సన్మానం ఎందుకు? : కేంద్రంపై గౌరవ్ గొగోయ్ సెటైర్లు

పాకిస్తాన్ తో యుద్ధం గెలిచి వచ్చారా?.. ప్రధాన్ కు సన్మానం ఎందుకు? : కేంద్రంపై గౌరవ్ గొగోయ్ సెటైర్లు

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. ఎగ్జామ్స్ లీకేజీల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలకు నైతిక బాధ్యత వహించాల్సింది పోయి, మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు వస్తే బీజేపీ నాయకులు పూలమాలలతో ఘనస్వాగతం పలకడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రధాన్ ఏమైనా... పాకిస్తాన్ తో యుద్దం గెలిచి వచ్చారా? అని ప్రశ్నించారు.  పేపర్ లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ అనడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

►ALSO READ | 74 ఏళ్ల వయసులో ఎంత కష్టమొచ్చిందో: ఆధార్ కార్డు ఇవ్వట్లేదని కలెక్టరేట్‎లో 74 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

2024లో తెచ్చిన యాంటీ పేపర్ లీక్ చట్టం పకడ్బందీగా ఉంటే, 2026లో మళ్లీ భారీ లీకులు ఎలా జరిగాయని నిలదీశారు. నీట్-యూజీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన 45 మందిలో 44 మంది బెయిల్‌పై బయట ఉన్నారని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఎన్‌టీఏ చీఫ్‌ను ఎందుకు కాపాడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ్ గొగోయ్ తీవ్రంగా ప్రశ్నించారు.