- మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు
భండారా: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్-–రాయ్‌పూర్ జాతీయ రహదారిపై పింపల్‌గావ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బొలేరో వెహికల్ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టగా తొమ్మిది మంది మృతి చెందాడు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఓ ట్రక్కు హైవేపైకి వస్తుండగా బొలేరో వెహికల్ వేగంగా వచ్చి ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో బొలేరోలోని ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి దవాఖానలో మృతి చెందాడు. స్థానికులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తరలించారు.
