జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్‌తో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. మహిళా ఉద్యోగి పట్ల అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇలాంటి ఘటనలను పార్టీ సమర్థించదని స్పష్టం చేశారు. బాధిత అంగన్వాడీ టీచర్‌కు ఎంపీ నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు.
అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ సూపర్వైజర్ను కూడా బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ బాధ్యులపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, జిల్లా ఇన్చార్జ్ శ్రీనివాస్‌ను కోరినట్లు తెలిపారు.
