ఈ వారంలో డిగ్రీ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్

ఈ వారంలో డిగ్రీ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్
  • 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన టీజీపీఎస్సీ
  • కొత్త రోస్టర్, నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీల భర్తీకి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ రద్దు చేసింది. కొత్త రోస్టర్, నిబంధనలకు అనుగుణంగా ఈ వారంలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు సంబంధించి 544 పోస్టుల భర్తీకి 2022లో 33/2022 బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై తాజా కమిషన్ సమగ్రంగా చర్చించి నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. 33/2022 నోటిఫికేషన్ తక్షణమే రద్దయిందని, అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత తెలిపారు