హౌతీల సరికొత్త ఏఐ వ్యూహం.. 'మోచా' ఓడరేవు ఏఐ సహాయంతో కైవసం

హౌతీల సరికొత్త ఏఐ వ్యూహం.. 'మోచా' ఓడరేవు ఏఐ సహాయంతో కైవసం
  • గొంతు క్లోన్ చేసి ఆ దేశ సైన్యాన్ని వంచించిన యెమెన్ రెబెల్స్

సనా: యెమెన్‌లోని వ్యూహాత్మక 'మోచా' ఓడరేవును హౌతీ రెబెల్స్ ఏఐ సహాయంతో కైవసం చేసుకున్నారు. యూఏఈ మద్దతు గల నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ తారిక్ సలేహ్ గొంతును ఏఐ ద్వారా క్లోన్ చేసి, సైనికులు వెనక్కి తగ్గాలంటూ నకిలీ ఆడియో సృష్టించారు. ఈ సైకోలాజికల్ వార్‌ఫేర్‌తో గందరగోళానికి గురైన సైన్యం వెనకడుగు వేసింది. మరోవైపు ఆంథ్రోపిక్ 'క్లాడ్' ఏఐని హూతీలు క్షిపణి గైడెన్స్ కోసం వాడినట్లు సమాచారం.

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్రసముద్ర ప్రాంతంలో హూతీల ఈ డిజిటల్ అస్త్రాల ప్రయోగం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.కాగా, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై ప్రత్యక్ష దాడులు జరపాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్  చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. హౌతీల దూకుడుపై చర్చించేందుకు ఎంబీఎస్ చేసిన ఫోన్ కాల్స్‌ను ట్రంప్ రెండుసార్లు తిరస్కరించినట్లు 'ఆక్సియోస్' మీడియా సంస్థ వెల్లడించింది.