Saudi oil pipeline blast: సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడి.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు పైపులైన్ ధ్వంసం

Saudi oil pipeline blast: సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడి.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు పైపులైన్ ధ్వంసం

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత ల మధ్య  సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు పైపులైన్, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు పైపులైన్లు ధ్వంసమయ్యాయి. సౌదీ  అరేబియాలోని తూర్పు, పశ్చిమ పైపులైన్  పై  శుక్రవారం దాడి చేసింది. ఈ దాడితో ప్రపంచ చమురు సరఫరా మార్గాలపై మరింత ఒత్తిడి పెరగనుంది.

 దాదాపు 12వందల కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఉన్నది ఈ పైపులైన్.. దీని ద్వారా హార్ముజ్ జలసంధిని దాటి ముడి చమురును అరేబియా ప్రపంచ దేశాలకు  సరఫరా చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతం ఈ పైపులైన్ ద్వారానే జరుగుతుందని షిప్ ట్రాకింగ్ కంపెనీలు చెబుతున్నాయి. 

దాడి కి సంబంధించిన  ఉపగ్రహ ఛాయాచిత్రాలను బయటికొచ్చాయి.  దాడిని ధృవీకరించిన రియాద్ పైపులైన్ ను మూసివేస్తున్నట్లు తెలిపింది.  ఈ దాడిలో  చాలామంది గాయపడ్డారని, భారీ ఆస్తి నష్టం  జరిగిందని, దాని విలువ అంచనా వేస్తున్నామని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.