శనివారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వినాయకచవితి ముందు రేటెంతంటే?

శనివారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వినాయకచవితి ముందు రేటెంతంటే?

శుక్రవారం భారీగా పతనం అయిన బంగారం రేట్లు శనివారం స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రధానంగా ఇరాన్ అరబ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసిన వేళ బులియన్ మార్కెట్లనూ ఆ ప్రకంపనలు తాకుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీంతో నిదానంగా తగ్గుతాయ్ అనుకుంటున్న పసిడి ధరలు మళ్లీ పెరగటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అవుతున్నారు. వినాయక చవితికి ముందు షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారు ముందుగా తమ నగరాల్లోని తాజా ధరలను పరిశీలించటం మంచిది.

సెప్టెంబర్ 12న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. సెప్టెంబర్ 11 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.16 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 458గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 170గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 12, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.