ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. శుక్రవారం సినిమా విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని తెలియజేసిన టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన లభించింది. మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని చెప్పాడు. అమ్మాయిలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని వైష్ణవి చైతన్య చెప్పింది. విదేశాల్లో చదువుకునే యూత్‌కి ఈ సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుందని దర్శకుడు ఆదిత్య హాసన్ చెప్పాడు. కమర్షియల్ లెక్కలు కాదు, మనసుకు నచ్చి చేసిన సినిమా ఇదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు.
