ఆసక్తికరంగా ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్

ఆసక్తికరంగా ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్

రాహుల్ విజయ్ హీరోగా సాయి బాలి దర్శకత్వంలో కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్న చిత్రం ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’. తాజాగా ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ గ్లింప్స్.. భయానక విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

యువతుల అదృశ్యానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అర్చన అయ్యర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 9న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు