అప్పులు,ఈఎంఐల బాధ భరించలేక ప్రాణం తీసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

అప్పులు,ఈఎంఐల బాధ భరించలేక ప్రాణం తీసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు, ఈఎంఐల బాధ భరించలేక జీవితం మీద విరక్తితో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్(42) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థికంగా తాను చితికిపోయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు తన చావుకు ఎవరు బాధ్యులు కాదని కేవలం తాను చేసిన అప్పుల బాధతో చనిపోతున్నట్లు రాశాడు.

తాను ఉన్నన్ని రోజులు తన కుటుంబానికి ఏమి చేయలేదని మనస్తాపం చెంది తన కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో వేడుకున్నాడు. జగన్ అకాల మరణంతో ఎండపల్లి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగన్ గతంలో గ్రామంలో వార్డు సభ్యునిగా, సర్పంచ్గా కూడా పనిచేశాడు. సింహాచలం జగన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.