కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.2.96 కోట్లు నిధులు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ యార్డులో గోదాం నిర్మాణానికి రూ.226.50 లక్షలు, డ్రెయిన్ నిర్మాణానికి రూ.55 లక్షలు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.14.50 లక్షలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల సౌకర్యం కోసం మార్కెట్ యార్డ్‌లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.
