శంకరపట్నం: సాయం కోరి వచ్చి.. ఆపై కత్తితో బెదిరించి..మహిళ మెడలోని బంగారం గొలుసు లాక్కెళ్లిన కి‘లేడీ’

శంకరపట్నం: సాయం కోరి వచ్చి.. ఆపై కత్తితో బెదిరించి..మహిళ మెడలోని బంగారం గొలుసు లాక్కెళ్లిన కి‘లేడీ’

శంకరపట్నం, వెలుగు: సాయం చేయామని వేడుకుంటున్నట్టు నటించిన ఓ మహిళ.. కత్తి చూపించి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జరిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల కమలాకర్ రావు శుక్రవారం వ్యవసాయ పనుల కోసం వెళ్లగా, ఆయన భార్య సరోజన ఇంట్లో ఒంటరిగా ఉంది. 

మధ్యాహ్నం ఓ మహిళ సరోజన ఇంటి వద్దకు వచ్చి సాయం చేయాలని కోరింది.  నిజమేనని భావించిన సరోజన వివరాలు తెలుసుకుంటుండగా సదరు మహిళ సంచిలో ఉన్న కత్తిని తీసి సరోజనను చంపుతానని బెదిరించింది. మెడిలోని బంగారం గొలుసును లాక్కొని, ఇంటి తలుపులు పెట్టి గొల్లం వేసి పరారయ్యింది. సరోజన కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి గొల్లం తీశారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హుజురాబాద్ రూరల్ సీఐ, కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సమీప సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.