కరీంనగర్ : పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?..కరెంట్ కోతలపై రైతుల ఆందోళనలు

కరీంనగర్ : పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?..కరెంట్ కోతలపై రైతుల ఆందోళనలు

కోరుట్ల/తిమ్మాపూర్/జగిత్యాల రూరల్/గన్నేరువరం, వెలుగు: నిత్యం కరెంట్ కోతలు విధిస్తున్నారని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని రైతులు కన్నెర్రజేశారు. పలు చోట్ల ఆందోళనలకు దిగారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులోని సబ్ స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి ధర్నా చేశారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌‌‌‌‌‌‌‌గల్​లో, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో, రైతులు రోడ్డెక్కారు. సుందరగిరి చౌరస్తా వద్ద రైతులు మొక్కజొన్న, పత్తి కర్రలతో ఆందోళన చేశారు.

గన్నేరువరంలోని విద్యుత్ సబ్ స్టేషన్​ను రైతులు ముట్టడించారు. పంటలు పొట్ట దశలో ఉన్నా యని, నీరు పెట్టాల్సిన సమయంలో కరెంట్​సరఫరా సరిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, కష్టపడి పండించిన పంట ఎండిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిం చారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తరచూ కోతలతో పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆగ్రహించారు. బావుల్లో నీరున్నప్పటికీ విద్యుత్‌‌‌‌‌‌‌‌ కోతల వల్ల పంటలకు నీరందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సాగుకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ అందించాలని, అందుబాటులో ఎరువులు ఉంచాలని డిమాండ్​ చేశారు.