బ్రిక్స్ సమిట్‌ కోసం ఢిల్లీకి అరుదైన కారులో జిన్‌‌‌‌‌‌‌‌పింగ్

బ్రిక్స్ సమిట్‌ కోసం ఢిల్లీకి అరుదైన కారులో జిన్‌‌‌‌‌‌‌‌పింగ్

న్యూఢిల్లీ: బ్రిక్స్ సమిట్‌ కోసం ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌‌‌‌‌పింగ్ పర్యటనలో ఆయన కోసం తీసుకొచ్చే 'హోంగ్కీ ఎన్701'లీమోసిన్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కారు ధర సుమారు 7 లక్షల డాలర్లు( రూ. 6 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది సాధారణ మార్కెట్లో దొరికే మోడల్ కాదు. చైనాకు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'హోంగ్కీ' దీనిని చాలా సీక్రెట్ గా  కేవలం దేశాధినేత కోసం మాత్రమే తయారు చేసింది. 'రెడ్ ఫ్లాగ్' అని అర్థం వచ్చే ఈ బ్రాండ్ కార్లను జిన్‌‌‌‌‌‌‌‌పింగ్ గతంలో అమెరికా, రష్యా పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించారు.

రాబోయే దశాబ్ద కాలంలో ఇలాంటి కార్లు కేవలం 50 వరకు మాత్రమే ఉత్పత్తి అవుతాయని సమాచారం.  'హోంగ్కీ ఎన్701'లీమోసిన్ కారు సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి 21 అంగుళాల బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, అత్యంత బలమైన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అమర్చారు. పేలుళ్లను తట్టుకునేలా, అలాగే కెమికల్ అటాక్ జరిగినా లోపలి ప్రయాణికులకు రక్షణ లభించేలా దీనిని రూపొందించారు.